కోమటిరెడ్డి సోదరులకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పేరు ఎవరూ కాదనలేనిది. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రముఖ నాయకుల్లో వారు ఒకరు. టీఆరెఎస్ వేవ్ తట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా వారికే సాధ్యం అయ్యింది. అంతకుముందు టీఆర్ఎస్‌ను ఓడించి ఎమ్మెల్సీగా కూడా గెలిచిన చరిత్ర.
అయితే… తమను టీఆర్ఎస్‌లోకి సీఎం కేసీఆర్ ఆహ్వనించారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు తమను స్వయంగా సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వనించారు. కానీ తాము వెళ్లలేదని, ప్రజల కోసం కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. 2014,2019 ఎన్నికల సందర్భంలో కేసీఆర్ ఆహ్వనాలు పంపారని, కానీ నియోజవకర్గ సమస్యలు చెప్పుకుందామని అపాయింట్‌మెంట్ అడిగినా చిల్లర ప్రచారం చేస్తున్నారని స్థానిక టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు.
గతంలో ఓసారి సీఎం కేసీఆర్‌ను కలిసినా మునుగోడు నియోజవర్గంలోని భూసేకరణ సమస్యపై మాత్రమే కలిశానని, మూసి కోసం నిధులు కేటాయించాలని మాత్రమే కోరినట్లు తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా రోజుల నుండి ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో… తాము పార్టీ కోసం పార్టీ మారలేదంటూ మద్దతునిచ్చే ప్రయత్నం చేశారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.