భారతీయులపాలిట ఉరితాడులా సిఏఏ , ఎన్ ఆర్సీ , ఎన్ పిఆర్ చట్టాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చెయ్యాలని నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సిఏఏ , ఎన్ ఆర్సీ , ఎన్ పిఆర్ పై ఇప్పటికే అమలు చేయవద్దని స్పష్టంగా జి.ఓ. జారీ చేసిన ఘనత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
మూడు రాజధానులను శాసనమండలిలో అడ్డుకున్నామని అనే చెప్పే తెలుగుదేశం నాయకులు శాసనమండలిలో సిఏఏ , ఎన్ ఆర్సీ , ఎన్ పిఆర్ కు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీ జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభకు ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పాల్గొంటారని తెలిపారు.