విజయవాడ: మొన్న వైఎస్ బొమ్మని బెజవాడ సెంటర్లో పెట్టించారో లేదో మల్లాది విష్ణుకి జోడు పదవులు దక్కాయి. ఆయన్ని టీటీడీ బోర్డు మెంబర్‌గా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు వార్తలొచ్చాయి.
మల్లాది విష్ణు…! విజయవాడ పాలిటిక్స్‌లో ఫేమస్ ..!! గతంలో ఎమ్మెల్యేగా, వుడా ఛైర్మన్‌గా పనిచేసి తర్వాత బెజవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు. 2014 ఎన్నికల్లో కాలం కలిసి రాలేదు. 2019 ఎన్నికల్లో అదృష్టం వరించింది. లక్కీగా స్వల్ప మెజారిటీతో విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే… మాల్లాదికి మరింత అదృష్టం పట్టింది. సీఎం వైఎస్ జగన్ మల్లాదికి డబుల్ ధమాకా ఇచ్చారు. అటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా, ఇటు ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు సభ్యుడుగా అవకాశం ఇచ్చి మల్లాది అంటే ఏంటో బెజవాడ వాసులకు తెలియజెప్పారు.
అంతే… నేతను నమ్మితే ఇలాగే డబుల్ ధమాకా వస్తుంది. మల్లాది వైఎస్ ఫాలోయర్. అందుకే దగ్గరుండి అవతార్ పార్కులో వైఎస్ విగ్రహాన్ని పున: ప్రతిష్ఠించడంలో కీలకంగా వ్యవహరించారు. స్వామి భక్తి పరాయణులకు అదృష్టదేవత వరాలు ఇస్తుంది కదా..! అలాగే మల్లాది పొలిటికల్ జాక్ పాట్ కొట్టారు.