కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పిచ్చి పట్టిందని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు.
తాము ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గడపగడపకు వెళుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం బురద చల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కూల్చిన దేవాలయాలను మేము క్రమ పద్ధతిలో తిరిగి మళ్ళీ నిర్మిస్తున్నామన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు మల్లాది విష్ణు. సోము వీర్రాజు ఒక గాడిద.. నిన్ను అనడానికి ఈ మాట కన్నా దిగజారుడు పదం ఇంకేమైనా ఉందో చూసుకోమని మండిపడ్డారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.