జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఎన్నో భూకబ్జా ఆరోపణలున్నాయి. ఆయన ప్రభుత్వ స్థలాలను, చెరువు భూములను వదలిపెట్టరని స్థానికంగా అనేక ప్రచారాలున్నాయి. చేర్యాల మండలం పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని ముత్తిరెడ్డి కబ్జా చేసి, ఆయన కూతురు పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని జనగాంలో అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. చేర్యాల బంద్ కు కూడా పిలుపునిచ్చి… శుక్రవారం అక్కడ నిర్మించిన ప్రహరీగోడలను కూల్చివేశారు.
ఇంతటితో ఎమ్మెల్యే వెనక్కి తగ్గుతారని అంతా భావించారు. కానీ శుక్రవారం రాత్రికి రాత్రే గోడ కూల్చిన చోటే మళ్లీ గోడను నిర్మించేశారు. పోలీస్ పహారాలో గోడ నిర్మించారని, ఎమ్మెల్యే మరీ ఇంత బరితెగిస్తారా అంటూ స్థానిక నాయకులతో పాటు ప్రజలు మండిపడుతున్నారు.