బెంగుళూరులో డ్రగ్స్ తీగలాగితే… డొంక హైదరాబాద్ లో కదులుతుంది. కొన్నాళ్ల క్రితం పట్టుబడ్డ నైజీరియన్స్ ను బెంగుళూరు పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కన్నడ నిర్మాత శంకర్ గౌడ్ తో కలిసి కలహర్ రెడ్డి, సందీప్ లు ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ డ్రగ్స్ రాకెట్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కొకైన్ తీసుకుంటారని… రెగ్యూలర్ గా సప్లై చేస్తామని, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులంతా కలిసి పార్టీలు చేసుకుంటారని తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ ఎమ్మెల్యేలంతా బెంగుళూరు కేంద్రంగా పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో లేరంటే… వీరంతా బెంగుళూరులోఓ ఉన్నట్లేనన్న చర్చ స్థానికంగా ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల పేర్లు వినపడతున్నాయి. కానీ అధికారికంగా దృవీకరణ కాలేదు. సందీప్ బెంగుళూరుకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్న నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేల పేర్లు చెప్పగా… వారు వీరేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలో వీరిని కూడా బెంగుళూరు పోలీసులు విచారించనున్నారు.
గతంలో తెలంగాణలో డ్రగ్స్ రాకెట్ బయటపడ్డప్పటికీ…. రాజకీయ ఒత్తిళ్లతో విషయం సమసిపోయిందని, కానీ ఇప్పుడు బెంగుళూరు పోలీసులు మాత్రం దూకుడుగా ఉన్నారని తెలుస్తోంది.