బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ఆపాలని రోహిత్ రెడ్డి పిటిషన్ పై వాయిదా పడింది. ఈడీ కౌంటర్ పై వాదనలకు రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది గడువు కోరారు. ఈ మేరకు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది హైకోర్టు.
కాగా ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు ఇప్పటికే సీబీఐకి చేరింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. సిట్ దర్యాప్తు యథావిధిగా కొనసాగేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన అప్పీల్ ను.. ఇదివరకే సీజే ధర్మాసనం కొట్టేసింది.
ఈ పిటిషన్ కు అర్హత లేదని న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నేర తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని .. దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు పేర్కొంది.