తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు సీబీఐకి బదిలీ చేయడాన్ని ఆపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లో కోరింది. జీవో 63 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరింది.
అయితే ఎమ్మెల్యే కేసును విచారిస్తున్న సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 63 రద్దు చేసింది.