ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేటలో తనవి 18లక్షలు దొరికాయంటూ నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద పిటిషన్ విచారణకు వచ్చింది.
అయితే ఈ విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందన్న న్యాయమూర్తి, పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి సూచించారు.