అద్భుతమైన సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటూనే.. మరో పక్క విమర్శలు ఎదుర్కొంటోంది ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పైల్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. దీంతో పలువురు ఆమపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.
తాజాగా.. ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. హిందువుల కించపరిచినట్టు మాట్లాడిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ కి వెళ్లి చూస్తే కశ్మీర్ పడింట్ల పరిస్థితులు ఏంటో అర్థం అవుతాయన్నారు రాజా సింగ్.
హిందువుల పైన మాట్లాడిన సాయిపల్లవి.. మిగతా మతాలపై కూడా ఇలాగే మాట్లాడగలదా..? అంటూ ప్రశ్నించారు. హిందువుల పట్ల చులకనగా మాట్లాడితే ఎరికైనా సరే బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే.
కాగా విరాటపర్వం మూవీ ప్రమోషన్ లో భాగంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో ఆమె పైన ఆయా పోలీసు స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి.