న్యూ ఇయర్ వేడుకలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో రాజాసింగ్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 అర్థరాత్రి న్యూ ఇయర్ చేసుకోవడం భారతీయ సంస్కృతి కానే కాదన్నారు. పాశ్చాత్య సంస్కృతి అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారిని సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులుగా ఆయన అభివర్ణించారు. 200 ఏళ్ల పాటు భారత దేశాన్ని పాలించిన ఇంగ్లీషు వారి సంస్కృతి న్యూ ఇయర్ అని పేర్కొన్నారు.
డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల సమయంలో దుష్ట శక్తులు ఆవహించినట్లు ప్రజలు వేడుకల్లో పిచ్చిగా మునిగిపోతున్నారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం మనది కాదనే విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. దీనిపై ప్రజల్లో అవగామన కల్పించాలన్నారు.
మనకు కొత్త సంవత్సరం ఉగాది రోజే ప్రారంభమవుతుంది. భారతీయులందరూ ఆరోజే కొత్త సంవత్సరంగా భావించాలన్నారు. జనవరి 1న ఘనంగా జరుపుకునే సెలబ్రేషన్స్ ని ఆయన తీవ్రంగా విమర్శించారు ఎమ్మెల్యే రాజాసింగ్.