రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రైతుల భూములను కబ్జా చేసి వెంచర్లు వేసిన ఘనత మంత్రి కేటీఆర్ కే దక్కుతుందన్నారు. రైతు చట్టాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ఎంతో మేలు చేసేవని, కానీ ప్రతిపక్షాలు రాజకీయం చేసేందుకు వారిని వాడుకుంటున్నాయని విమర్శించారు. కావాలనే కొందరు మధ్యవర్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.