రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందని ఆరోపించారు. టీఆర్ఎస్ డబ్బులు పంపకాన్ని అడ్డుకోవటంలో ఎస్‌ఈసీ పూర్తి విఫలమైందని మండిపడ్డారు.
ప్రలోభాలను అడ్డుకోవాలని ప్రయత్నించిన బీజేపీ నేతలపై దాడులను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ నేతలు, స్థానికేతరులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తుంది.