రౌడీ ఎమ్మెల్యే ఇదేదో ఎవరో అన్నది కాదు… స్వయంగా హైదరాబాద్ పోలీసులు పోలీస్‌స్టేషన్‌లో అందరికీ కనపడేలా అంటించిన కాపీలో ఉన్నదే. పోలీసులు ఎప్పటికప్పుడు రౌడీషీటర్ల పేర్లను విడుదల చేస్తుంటారు. తాజాగా మంగళ్‌హాట్ పోలీసులు విడుదల చేసిన జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుంది. దీంతో.. రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై మరోసారి ఫైర్ అయ్యారు.
తన పేరుతో రౌడీషీట్‌ను చూసి బాధపడ్డానని… ప్రజాసేవ చేస్తూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను రౌడీ షీటర్ అనటం దారుమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పోలీసులు కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నాని… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రౌడీషీటరల్లు ఉన్నారని మరీ వారి పేరు కూడా రౌడీషీట్లో పెడతారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనిపై సీఎం, హోమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.