బతుకమ్మ పండగ గురించి, దాని విశిష్టత గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బతుకమ్మ పండగ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని గ్రామాల్లో కూడా సంతోషంగా జరుపుకుంటారు. అయితే భక్తి శ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్న స్థలానికి వెళ్లి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన నిర్వాహకం తెలిసిందే.
చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడుతూ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. ఈ నేపథ్యంలోనే చెప్పులు వేసుకుని బతుకమ్మ అడటం శిగ్గు శేటు అని హిందూ సభ్య సమాజం తల దించుకునే విధంగా వ్యవహరించిన తాటికొండ రాజయ్య హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎస్సి మోర్చా జనగామ జిల్లా అధ్యక్షులు ముక్క స్వామి. అంతే కాకుండా తెలంగాణ మహిళలు కూడా చాలా మంది రాజయ్య చేసిన పనిని తప్పుబడుతున్నారు.