ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరగడంపై బీహార్ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే శివచంద్ర రామ్ ఉల్లిగడ్డల మాల మెడలో ధరించి అసెంబ్లీ కొచ్చారు. ఉల్లిగడ్డలు, కూరగాయల ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తిండి కూడా తినలేకపోతున్నారని…రూ.50 కంటే తక్కువగా ఉండే కిలో ఉల్లిగడ్డ ఈరోజు రూ.80 అయ్యిందని అన్నారు. ఈ ఉల్లిగడ్డలు తాను రూ.100 కు కిలో చొప్పున తీసుకున్నానని తన మెడలో ఉన్న ఉల్లిగడ్డ మాలను చూపారు. అన్ని కూరగాయలు కిలో రూ.35 లోపే ఇచ్చే స్టాల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్…ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. మార్కెట్లో ధరల పరిస్థితిని ముఖ్యమంత్రికి అర్ధమయ్యేలా చెప్పడం కోసమే తాను అసెంబ్లీకి ఈ విధంగా వచ్చానని చెప్పారు ఎమ్మెల్యే శివచంద్ర రామ్.