ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నా రోజా, టీడీపీ అధినేత ప్రోద్బలంతోనే దాడులు జరిగాయన్నారు.
ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాభవాన్ని చవిచూడటంతో చంద్రబాబు దానిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారని మండిపడ్డారు. రైతులతో పేరుతో టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతల పైకి దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోనే ఇలాంటి తరహా దాడులను చూస్తామని వ్యాఖ్యానించారు. రాజధాని రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.