రాజకీయాలు, టీవీ షోలతో బిజీబిజీగా గడిపే వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు కబడ్డీ ప్లేయర్‌గా మారిపోయారు. భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ కబడ్డీ అంటూ కోర్టులోకి దూకారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోటీలు జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన రోజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.
విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని రోజా సూచించారు. విద్యతోపాటు ఆటల్లోనూ సత్తా చాటాలన్నారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో మంచిదని తెలిపారు.