నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకొని అదిరింది షోకు వచ్చాక ఆయన జబర్దస్త్ నిర్మాతలపై పలు విమర్శలను చేశాడు. వారి వైఖరి నచ్చకే షో మారాల్సి వచ్చిందన్నారు. ఇక అదిరింది షో ఆర్టిస్టులు జబర్దస్త్ షో పై పలు మార్లు సెటైర్లు వేయడంతో నాగబాబు పగలబడి నవ్వారు. దాంతో జబర్దస్త్ నుంచి కూడా రివర్స్ ఎటాక్ మొదలైంది. నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తోన్న అదిరింది షో ప్రారంభమయ్యే సమయానికి… ఇదివరకు నాగబాబు ఉన్నప్పట్టి ఎపిసోడ్ లను ప్రసారం చేస్తున్నారు. ఇలా ఈ రెండు షోల మధ్య రోజురోజు వైరం పెరుగుతూనే వస్తోంది. తాజాగా హైపర్ ఆది వేసిన పంచ్ మరోసారి హాట్ టాపిక్ అయింది.
గురువారం ప్రసారమైన జబర్దస్త్ లో హైపర్ ఆది వేసిన పంచ్ చర్చనీయాంశమైంది. ఆది స్కిట్ లో భాగంగా అతని సహచర ఆర్టిస్ట్.. మిగతా ఆర్టిస్టులను ఉద్దేశించి చీరల్ని, నగల్ని… వీళ్ళని కూడా తీసుకెళ్తా అని అంటాడు. అదే సమయంలో హైపర్ ఆది కలుగజేసుకొని ఆ తీసుకెళ్ళరా… యాంకర్లను, మమ్మల్ని, జడ్జీలను తీసుకెళ్లి.. నువ్వు కూడా కుదిరింది అనే ఓ షో పెట్టుకో అని అంటాడు.ఆ సమయంలో రోజా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆది ఏంటి ఒక్కసారిగా ఇలా పంచ్ వేశాడన్నట్టు షాక్ అయింది. అక్కడితో ఆగకుండా ఆమె పగలబడి నవ్వారు. అయితే హైపర్ అది పంచ్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నాగబాబు వల్లే వారంతా ఆ స్థాయిలో ఉన్నారనే విషయం మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు.