దండేపల్లిలోని కోయపోచగూడ అటవీ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంధనపల్లిలో చేపలు పట్టడానికి వెళ్తే కేసులు పెడ్తున్నారని చెప్పారు.
దీనికి సంబంధించి వార్తలు రాసిన రిపోర్టర్లపైనా కేసులు పెట్టారని ఆమె తెలిపారు. మహిళలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చిన్నపిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు దుశ్శాసన పర్వాన్ని గుర్తు చేశారంటూ మండిపడ్డారు. ఆదివాసీలను ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆమె చెప్పారు.
సాగులో ఉన్న భూముల జోలికి వెళ్లొద్దని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. వారి సమస్యపై సానుభూతితో స్పందించి త్వరలో ఓ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.