మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ కు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కౌంటర్ వేశారు. శనివారం మీడియా సమావేశంలో అఖిల ప్రియ మాట్లాడిన తీరు బయటపడిందన్నారు. ఆదివారం శిల్పా రవి మీడియాతో మాట్లాడుతూ..మెడికల్ కాలేజీ వస్తుందని 50 ఎకరాలు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారన్నది అవాస్తమన్నారు.
అఖిల ప్రియ ఆరోపణకు ఆయన కౌంటర్ వేస్తూ.. మాకు ఉన్నది 30 ఎకరాలు మిగతా 20 ఎకరాలు ఎవరైనా తీసుకోవచ్చారా అని ఎద్దేవా చేశారు. 50 ఎకరాలు కమర్షియల్ చేశారన్నది అవాస్తమని.. ఉన్న 30 ఎకరాలు కూడా ఒకే దగ్గర లేవని చెప్పారు ఆయన. మా నాన్న ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసుకోవచ్చన్నారు శిల్పా రవి.
హైదరాబాద్ డెవలప్ అయ్యే ప్రాంతాల్లో మేము భూమి కొన్నాం.. మా ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ అని ఆయన అన్నారు. కందుకూరులో మీరు 200 ఎకరాలు కొన్నారని.. మీ ఆస్తుల విలువలు పెరిగితే మేము బాధపడుతున్నామా.. అని ఆయన అఖిల ప్రియను ప్రశ్నించారు. ఎదుటి వారిపై ఈర్ష్య పడడం కంటే వాస్తవాలు తెలుసుకోండని అన్న ఆయన అఖిలప్రియ తీరు హ్యాస్యాస్పదంగా ఉందన్నారు.
అయితే అఖిలప్రియ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని శిల్పా రవి అన్నారు. ఇక శిల్పా రవిచంద్రకిషోర్ అవినీతి,అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానంటూ భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. 4న నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకువస్తానని.. తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు.