జంక్షన్లో ఫంక్షన్! - mla son birth day celebrations traffic jam- Tolivelugu

జంక్షన్లో ఫంక్షన్!

అమలాపురం: ఆయనో ఎమ్మెల్యే గారి కొడుకు. పైగా బర్త్ డే. ఇంకేముంది..? చిన్న సారు జన్మదిన వేడుకలు చౌరస్తాలో ప్లాన్ చేశారు. మందీ మార్బలంతో వేడుకలు చేస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఏమౌతుంది.? మన జనమే కదా.. కాస్సేపు వెయిట్ చేస్తారు.
ఇదంతా ఏదో సినిమా కోసం రాసిన సన్నివేశం అనుకుంటున్నారా? లేదండీ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేగారి పుత్రరత్నం జన్మదిన వేడుకల్లో  కోసం జరిగింది ఇది.

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట నాలుగు రోడ్ల సెంటర్‌లో పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. మెయిన్ సెంటర్ కావటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు రెండు గంటల పాటు వాహనాలు కదలకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వారే ఇలా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వేడుకలు చేసుకోవటం ఏమిటని వైసీపీ నాయకులపై మండిపడ్డారు జనం.

Share on facebook
Share on twitter
Share on whatsapp