తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యే గొంగిడి సునీత కన్నీటిపర్యంతమయ్యారు. డయాలసిస్ పేషేంట్లు, వారి సమస్యలపై సభలో క్వశ్చన్ అవర్ నడుస్తున్న సమయంలో… గొంగిడి సునీత మాట్లాడుతూ డయాలసిస్ పేషేంట్ల కష్టాలు, ఆర్థిక భారం తనకు తెలుసని… తన తండ్రి కూడా 14 ఏళ్లు డయాలసిస్ పెషేంట్ గా ఉండటంతో తాము ఆర్థిక ఇబ్బందిపడ్డామని చెబుతూ కంటతడి పెట్టారు. ఆసరా పెన్షన్లు డయాలసిస్ వారికి కూడా వర్తింప చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
ఇదే విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో అసెంబ్లీ అవరణలో భేటీ అయి, యాదాద్రి భువనగిరి జిల్లాలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలా చేస్తే యాదాద్రి–భువనగిరి జిల్లాతో పాటు జనగాం జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు..