జూనియర్ అంటే భయపడే వ్యక్తి నారా లోకేష్ అని, లోకేష్ ఎన్ని జన్మలెత్తినా జూనియర్ అంత కాలేడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వంశీ. చచ్చుదద్ధమ్మ కాబట్టే మంగళగిరిలో మంత్రిగా ఓడిపోయారు అంటూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే వంశీ దాడి చేశారు.
సీఎం కావాలని లోకేష్, ప్రధాని పదవి ఆశతో చంద్రబాబు పళ్లు రాలగొట్టుకున్నారని మండిపడ్డారు. నా మీద ఫైర్ అయ్యేంత సీన్ లేదు… అసలు ఆయన దగ్గర ఫైరింజనే లేదంటూ ఎద్దేవా చేశారు.