మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలకు కౌంటర్ గా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ధీటుగా స్పందించారు. నీవోక పని పాటా లేని పోరంబోకువి… నీవు చెప్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంలో దేవినేని ఉమా ఒక్కడే ఉద్యమిస్తున్నట్టుగా నటిస్తున్నాడని విమర్శించారు. అమరావతి రాజధాని కోసం కట్టుబడి ఉన్నానంటూ.. రాజధాని విషయంలో నా నిర్ణయమేంటో పార్టీ వేదికపైనే స్పష్టంగా చెప్పానని తేల్చిచెప్పాడు. రాజధాని విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అమరావతి రాజధాని విషయంలో తానొక్కడి రాజీనామాతో ఒరిగేదేమి లేదని.. ఆ ప్రాంత రైతుకులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏది పడితే అది మాట్లాడటం మానుకోవాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హితవు పలికారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఎం న్యాయం చేశావని ప్రశ్నించారు. నీ టైం అయిపోయిందని నీ మాటలను ఎవ్వరు విశ్వసించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.