టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఓఆర్ఆర్ బిడ్డింగ్ పై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. గాలి వార్తలను బేస్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఓఆర్ఆర్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మంత్రి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన అలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. 10 శాతం నిధులు కట్టాలని కేటీఆర్ ఒత్తిడి తీసుకు వచ్చారనే వ్యాఖ్యల్లో అసలు ఏ మాత్రమూ నిజం లేదన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు బిడ్డింగ్‌పై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా వున్నామని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు వుంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రేవంత్ తన ఆరోపణలను నిరూపించలేక పోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.
పీసీసీ పదవిని అడ్డు పెట్టుకొని, నాలుగు పైసలు వెనుకేసుకుందామన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు ఉఫయోగపడే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడరని అన్నారు. కేవలం మతిస్థిమితం కోల్పోయి రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి ఇప్పుడు ఎసరు వచ్చిందన్నారు. పీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకమయ్యారని చెప్పారు. ఆ భయంతోనే తన పీసీసీ పదవిని కాపాడుకునేందుకు రేవంత్ నిరాధారమైణ ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.
111జీవో ఎత్తివేయాలని స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీర్మానాలు చేశారని వివరించారు. మరి వాళ్లనను కూడా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. 111 జీవో ఎత్తివేయొద్దని, ఆ జీవో ఉండాలని ఆ గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడే దమ్ము కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉందా? అని నిలదీశారు.