మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు వ్యవహారంలో సిట్ దర్యాప్తుని వేగం చేసింది. గత కొద్ది రోజులుగా ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ విచారణలో నిందితుల నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో రామచంద్రభారతి, నందకుమార్ లు.. ఢిల్లీ పెద్దలతో చేసిన వాట్సాప్ చాట్ చేసినట్లు కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.
ఆ వివరాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. బీఎల్ సంతోష్ తో వాళ్లు వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు ఉంది. రామచంద్రభారతి స్వామీజీ మెసేజ్ కి.. బీఎల్ సంతోష్ సమాధానం కూడా ఇచ్చారు. వీరి ఇద్దరి చాటింగ్ లో ఏకే సింగ్, వాసిత్ పేర్లు కూడా వచ్చాయి.
వాట్సాప్ సంభాషణలో కీలక వివరాలు సేకరించిన సిట్.. ఈ వాట్సాప్ చాట్ ఓ కీలక ఆధారంగా భావిస్తోంది సిట్. ఈ వివరాలను హైకోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా ఢిల్లీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలు కూడా సిట్ కోర్టుకు పంపింది.
ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడారన్న కంప్లీట్ డీటైల్స్ ని సిట్ హైకోర్టుకు సమర్పించింది. అయితే ఢిల్లీ పెద్దలతో నిందితులు చేసిన వాట్సాప్ చాట్.. సిట్ చేతికి చిక్కడంతో ఈ కేసుపై మరిన్ని కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.