• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » అసెంబ్లీలో వార్.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో వార్.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

Last Updated: March 28, 2022 at 11:20 pm

దేశంలో సంచలనం సృష్టించిన బీర్భ‌ూమ్ ఘ‌ట‌న‌ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో రణరంగాన్ని తలపించింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభ్యలోనే వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. అది కాస్తా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ స‌స్పెండ్ చేశారు.

ఇటీవల బీర్భూమ్ జిల్లాలో 8 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతల వ్యాఖ్యలను తృణమూల్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు.

ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్‌ తిగ్గ బట్టలు చిరిగిపోగా.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్‌ మజుందర్‌ ముక్కుకు గాయమైంది. స‌భ‌లో జ‌రిగిన ర‌భ‌స గురించి బీజేపీ నేత‌లు వీడియో షేర్ చేశారు. ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వ్య‌, ప్ర‌తినిధి షెహ‌జాద్ జై హింద్‌ తో పాటు అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌భ‌లో అడ్డుకున్నారు. రెండు వ‌ర్గాల ఎమ్మెల్యేల‌ను అడ్డుకునేందుకు మార్ష‌ల్స్ ప్ర‌య‌త్నించారు. ఇక తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీఎంసీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

ఈ ఘటనపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సువేందుతో సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బీజేపీ నేత సువేందు త‌న‌ను కొట్టిన‌ట్లు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మ‌జుందార్ తెలిపారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌పై స్టేట్‌ మెంట్ ఇవ్వ‌మంటే.. సివిల్ డ్రెస్సులో వ‌చ్చిన పోలీసులు త‌మ‌పై దాడికి దిగార‌ని సువేందు ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త లేద‌ని, 10 మంది ఎమ్మెల్యేల‌ను కొట్టార‌ని మండిపడ్డారు. అయితే.. టీఎంసీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అసెంబ్లీలో ఉద్రిక్తతలు సృష్టించేందుకే బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. కమలం పార్టీ నేతలే దాడి చేశారని, తమ ఎమ్మెల్యేలు కొంతమంది గాయపడ్డారని చెప్పారు.

Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.

What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE

— Amit Malviya (@amitmalviya) March 28, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

15 ఏండ్లలో అఖండ భారత్…!

ఏమైంది సారూ.. సడెన్‌ గా వచ్చేశారు!

నాకు ఇష్టం అనిపిస్తే గో మాంసం తింటా

మంత్రిపై వేటు.. సీఎం సంచలన నిర్ణయం

మెగా రహస్యం.. మేఘా బాగోతం

ఆగిన మెట్రో.. రాకపోకలకు అంతరాయం!

టీఆర్‌ఎస్ జై హనుమాన్‌ నినాదం.. బీజేపీ వల్లే!

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

అది ఫేక్ న్యూస్ – శివ నిర్వాణ

ఫిల్మ్ నగర్

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

అది ఫేక్ న్యూస్ - శివ నిర్వాణ

అది ఫేక్ న్యూస్ – శివ నిర్వాణ

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఖుషి.. విజయ్ దేవరకొండ మూవీ అప్ డేట్స్

ఖుషి.. విజయ్ దేవరకొండ మూవీ అప్ డేట్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)