తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాపుపై ఈ నెల 6వ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. అయితే సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం వద్ద అప్పీల్ చేసింది. విచారణలో భాగంగా సుధీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ వేసిన పిటిషన్లు పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సిట్ తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్ తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అడ్వకేట్ జనరల్ వాదలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్ ను ఆదేశించింది.