వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ప్రారంభమైందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి.. దావుద్ ఇబ్రహీంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ… ముగ్గురికి రాష్ట్రాన్ని అప్పజెప్పారని సీంఎ జగన్ పై బుద్దా వెంకన్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఉత్తరాంధ్రలో అందరూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్న ఆయన, 2022లో జమిలీ ఎన్నికలు వస్తాయని…మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జె టాక్స్ వసూళ్లు చేసి.. వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.