పార్టీ కండువా కప్పుకొని మంత్రి గంగుల కమలాకర్ పోలింగ్ బూత్ లోకి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. పోలీసులు కూడా దీనికి వత్తాసు పలకడం దారుణమని ఆయన మండిపడ్డారు. తాను పోటీలో ఉండటంతో టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని అన్నారు.
పోటీ నుంచి తప్పుకోకుండా ఉండటమే తనకు గొప్ప విజయంగా భావిస్తున్నానని రవీందర్ సింగ్ తెలిపారు. నా ఓటుతో పాటు ఇంకో ఓటు పడినా.. తనదే గెలుపుగా భావిస్తానని అన్నారు. 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ తెలిపారు.