తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐదు ఉమ్మడి జిల్లాల పరిదిలో జరిగిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 5 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు రిజల్ట్స్ తెలిసే అవకాశం ఉంది.
ప్రతి రౌండ్ లో 200 ఓట్లు లెక్కపెట్టనున్నారు. అటు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.