తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాలలో ఒక్కో స్థానానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఆరు స్థానాలకు గాను.. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ తోపాటు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 14 న ఫలితాలు వెలువడనున్నాయి. చిన్న చిన్న ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.