బీఆర్ఎస్ నాయకులు ముందుగా కంటి వెలుగు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తే.. తాను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.
వ్యవసాయానికి నిర్ణీత సమయంలో కరెంట్ సప్లయ్ చేయాలని కోరారు. ఔరంగజేబు కాలంలో జుట్టు పన్ను ఉంటే ఇప్పుడు కేసీఅర్ పాలనలో ఏసీడీ చార్జీలు ఉన్నాయని విమర్శించారు. ఏసీడి చార్జీలు చట్ట విరుద్ధమని జీవన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారు. తనకు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం విషయంలో అధిష్టానందే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందని పేర్కొన్నారు జీవన్ రెడ్డి.