పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తైంది. ఇక ప్రకటనే తరువాయి. పీసీసీ కొత్త బాస్ గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ఖారారైందని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని… రేవంత్ కు ప్రచార కమిటీ, సీఎల్పీ నేతగా శ్రీధర్ బాబు, సమన్వయ కమిటీకి భట్టిని నియమిస్తున్నట్లు ప్రచారం జరిగింది. జీవన్ రెడ్డి పుట్టినరోజు నాడే ప్రకటన వస్తుందని మీడియా వర్గాలు కోడై కూశాయి.

సీన్ కట్ చేస్తే… ఈ పీసీసీ తన వల్ల కాదంటూ జీవన్ రెడ్డి హ్యాండ్సప్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపార్టీని నడపటం నా వల్ల కాదని, వయస్సు కూడా సహాకరించదని… ఏఐసీసీ పెద్దలకు సున్నితంగానే తన పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తనవంతు పాత్ర పోషిస్తానని, అయితే పీసీసీ వంటి కీలకమైన పదవిని యాక్టివ్ గా ఉంటూ అన్నింటినీ ఎదుర్కొనే నాయకులకే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ముగింపుకు చేరుకుంటుందనుకున్న పీసీసీ చీఫ్ ఎంపిక మరో టర్న్ తీసుకున్నట్లు అయ్యింది.
నిజానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా చేసిన మొదట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వినిపించింది. కానీ తను మాత్రం రేసులో లేనని… తన తరుపున రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ఆయనే బహిరంగంగా తెలిపారు.