అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలమే ఉందని పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు కవిత. నిజామాబాద్ ప్రజలకు ఏం జవాబు చెప్తారని నిలదీశారు. పసుపు విషయంపై స్పష్టంగా ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో అరవింద్ ఎదురుదాడికి దిగారు. ఈ విమర్శల లొల్లి అవసరం లేదని, రైతుల కోసం తాను చేయాల్సింది చేస్తానని, కవిత కూడా చేయాలనుకుంటున్నది చేసుకోవచ్చని తెలిపారు.
2024లో జరిగే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ తనపైనే పోటీ చేయాలని ఆమెను కోరిన అరవింద్.. దూద్ కా దూద్, పానీ కా పానీ హో జాతా అంటూ వ్యంగ్యంగా జవాబిచ్చారు.