బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళా శక్తి గురించి మాట్లాడారు. విద్యా, ఉద్యోగ విషయంలో ఎప్పటికప్పుడు మహిళలు అప్ డేట్ అవుతూ ఉండాలన్నారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. తాను కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చానని తెలిపారు.
అనంతరం మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి కవిత హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థినులపైకి రంగులు చల్లారు. విద్యార్థినులు కూడా కవిత వద్దకు చేరుకుని ఆమెకు రంగులు పూసారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి కోడలు షాలినీ, కాలేజీ విద్యార్థినులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. దీంతో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Celebrating #Holi and Women Empowerment with Malla Reddy Engineering College for Women family! 💛 pic.twitter.com/L7J2LVFSEe
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 7, 2023