మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఒకరోజు దీక్ష చేస్తోంది భారత జాగృతి. దీనికి సంబంధించిన వివరాల్ని కవిత మీడియాకు వివరించారు. ఏళ్లు గడుస్తున్నా మహిళా బిల్లుకు ఇంతవరకు పార్లమెంట్ ఆమోదం పొందలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ, ఆ బిల్లుకు మాత్రం మోక్షం దక్కడం లేదని చెప్పారు.
మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్ లో పడేశారని వ్యంగ్యంగా మాట్లాడారు కవిత. ఈ బిల్లు తెస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. 2014, 2018లో హామీ ఇచ్చిందని వివరించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించినా బిల్లుపై బీజేపీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.
మహిళా బిల్లుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు కవిత. రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యంలో మన స్థానం 148లో ఉందని తెలిపారు. ఈ విషయంలో మనకంటే బంగ్లాదేశ్ మెరుగ్గా ఉందన్నారు. శుక్రవారం ధర్నాలో 18 పార్టీలు పాల్గొంటున్నాయని.. ఏచూరి చేతులమీదుగా దీక్ష ప్రారంభం అవుతుందని వివరించారు కవిత.