విద్యాశాఖ మంత్రిగా కల్వకుంట్ల కవిత…? ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టీఆర్ఎస్ అనుకూలురు, జాగృతి సంస్థకు దగ్గర ఉండే వారితో పాటు కొందరు టీఆర్ఎస్ అనుకూల మీడియా జర్నలిస్టులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం చేస్తారని, హరీష్ రావుకు రెవెన్యూ శాఖతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని టీఆర్ఎస్ నాయకులు ఎవరూ కనీసం ఖండించ లేదు. దీంతో నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది…? పెద్ద సారు 13రోజులుగా ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారు అంటేనే ఎదో ఉంది అన్న కామెంట్స్ వినిపించాయి.
తాజాగా శనివారం సాయంత్రం నుండి కవితను మంత్రిని చేయబోతున్నారని, విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్సీ కవితకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికీ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ జరగలేదు. మరీ ఈసారి కొత్త క్యాబినెట్ లో చోటు దక్కుతుందేమో చూడాలి.