బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యులైన వారిని జైల్లో పెట్టాలని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్న ఓవైసీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని మెహిదీ పట్నంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…డిసెంబర్ 6న అందరు దుకాణాలు తెరిచి ఉంచాలని పిలుపు నిచ్చారు. అయోధ్య వివాదస్పద స్థలం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసిన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కు ఈ సభ మద్దతు నిస్తున్నట్టు తెలిపారు. అయోధ్యలో కూల్చిన మసీదు స్థలంలో కాకుండా వేరే చోట ఐదు ఎకరాల స్థలాన్ని తాము అంగీకరించబోమన్నారు.