సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురి మృతి చెందిన ఘటన పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్యూనెట్ కు సంబంధించిన అంశం ఎప్పుడూ వచ్చినా ఆయన కచ్చితంగా స్పందించి తీరుతారు. ఈక్రమంలోనే ఆయన స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూ నెట్ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని సూచించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు.. యువతీయువకులు ఎవరూ క్యూనెట్ తరహా కంపెనీల వలలో పడొద్దని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఎంఎల్ఎం సంస్థలు, వాటి అనుబంధ సంస్థల పట్ల దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలన్నారు. ఆయన సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు కేసులు కూడా పెట్టారు. కేసులు పెట్టిన ప్రతిసారి పేరు మార్చుకుని మరో రూపంలో మల్టీ చైన్ మార్కెటింగ్ సిస్టమ్‌ను నడిపిస్తూ క్యూనెట్ మోసం చేస్తోంది.
తాజాగా ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్న సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటన విషయంలోనూ క్యూనెట్ పేరే తెరపైకి వచ్చింది. ఉద్యోగమంటూ ఐడీ కార్డులిచ్చి, ఐడీ కార్డుల కోసం డబ్బు వసూళ్లు చేసి, ఆపై వాళ్లు MLM వ్యాపారాలు చేస్తున్న విషయం తేటతెల్లమయ్యింది.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ #QNet పాత్రపై సమగ్ర విచారణ జరగాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలి. 1/6
FILE PHOTOs pic.twitter.com/zPljnZMX54
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 18, 2023