బుధవారం కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ అవార్డుపై స్పందించిన కీరవాణి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘భారత ప్రభుత్వం పౌర పురస్కారంతో గౌరవించబడిన సందర్భంగా.. కవితాపు సీతన్న గారి నుండి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు నా తల్లిదండ్రులకు, నా గురువులందరికీ గౌరవం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my parents and all of my mentors from Kavitapu Seethanna garu to Kuppala Bulliswamy Naidu garu on this occasion 🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 25, 2023
అయితే కీరవాణికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. దీనిపై ఓ పోస్ట్ చేశారు. అన్నయ్య విషయంలో గర్వంగా ఉన్నట్లు.. కీరవాణితో దిగిన ఫోటోను తన సోషల్ మీడీయాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జక్కన్న.
‘నాకే గనక విశ్వంతో మాట్లాడే అవకాశం వస్తే.. అవార్డుకు అవార్డుకు మధ్య కాస్త గ్యాప్ ఇవ్వమని చెబుతా అంటూ పేర్కొన్నారు. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వమని చెబుతాను’అంటూ తెలిపారు.
View this post on Instagram