కరోనా మహమ్మారి కారణంగా వేల మంది మృత్యుఒడికి చేరుతున్నారు. అయితే కరోనా రోగులను కాపాడుకునేందుకు కరోనాను జయించిన వారు ప్లాస్మా డొనేట్ చేయాలంటూ సినీ ప్రముఖులు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మంగళవారం ప్లాస్మా డొనేట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తన కుమారుడు కాలభైరవ తో కలిసి కిమ్స్ ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేసినట్టు కీరవాణి పేర్కొన్నారు. ప్లాస్మా దానం అనేది రక్తదానం చేసినట్టు ఉంటుందని దీని కోసం ఎవరు భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు. ఇకపోతే ఇటీవల రాజమౌళి సహా కుటుంబం మొత్తం సంగతి తెలిసిందే.
Just done with voluntary donation of plasma at KIMS along with my son Bhairava.
Feeling good. It felt very normal like in a routine blood donation session. No need to fear at all for participating. pic.twitter.com/2WVGNUtCIR— mmkeeravaani (@mmkeeravaani) September 1, 2020