మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ వివాదం ముదురుతోంది. మసీదులపై లౌడ్ స్పీకర్ల తొలగింపునకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ ఎలాంటి కార్యాచరణకు దిగుతుందోనని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే మండిపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్లను తొలగించినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. లౌడ్ స్పీకర్లు అనేవి మతానికి సంబంధించిన సమస్య కాదన్నారు.
ఒక వేళ ప్రభుత్వ దాన్ని మత సమస్యగా మార్చాలనుకుంటే ఎంఎన్ఎస్ దానికి తగిన రీతిలో సమాధానం ఇస్తుందన్నారు. లౌడ్ స్పీకర్ల సమస్య సామాజిక సమస్య అన్నారు. తాను పెట్టిన డెడ్ లైన్ మంగళవారంతో ముగియనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మే 3 తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని ఆయన వెల్లడించారు. మసీదుల ముందు డబుల్ వాయిస్ తో హనుమాన్ చాలీసా ప్లే చేస్తామన్నారు. ఒక వేళ వారు( ముస్లింలు) అర్థం చేసుకోకపోతే మహారాష్ట్ర శక్తి ఏంటో వారికి చూపిస్తామని హెచ్చరించారు.