దేశంలో లాక్ డౌన్ అమలు చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ MNM పార్టీ అధ్యక్షుడు హీరో కమల్ హాసన్ ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను పెద్ద నోట్ల రద్దుతో పోల్చారు.
ఇదే అంశంపై నరేంద్ర మోడీకి మార్చి 23 న తన మొదటి లేఖలో, లాక్ డౌన్ కు ఒక రోజు ముందు, కమల్ హసన్ ఈ వైరస్ తో వచ్చిన అనిశ్చితి ప్రభావం నుండి బలహీన వర్గాలను రక్షించడానికి,వలస కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని ఆ లేఖలో కోరారు కమల్.ప్లానింగ్ లేకుండా నొట్ల రద్దులాగే ,లాక్ డౌన్ నిర్ణయం కూడా తీసుకున్నారని విమర్శించారు.
దేశ ప్రజలంతా మిమ్మల్ని నాయకుడిగా ఎంచుకున్న విషయాన్ని మరచిపోవద్దన్నారు.మీరు ఒక పిలుపు ఇస్తే దేశం మొత్తం పాటించిందని, మరి మీరు ప్రజలకు.ఏం చేస్తున్నరని ప్రశ్నించారు.ప్రధాని మాటలను వినే ప్రజలంతా ఓ వైపు నూనె పోసి దీపాలు వెలిగించారని, మరో వైపు రొట్టెలు వండుకునేందుకు కాసింత నూనె కూడా లేక నిరుపేదలు అలమటిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజలను ఉద్దేశించి మోదీ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి అవసరమే, కానీ,అంతకంటే మించిన పనులు చేయాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో గుర్తుచేశారు కమల్.ప్రధాని చేసిన మాటలు సంపన్నులు బాల్కనీలలో నిలిచి ఉత్సాహంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందేమోకాని, పైకప్పులు లేని ఇళ్ళలో నివసించే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కమల్ ఆరోపించారు.
ప్రధాని మోదీ రెండు సార్లు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రజలలో ఓర్పును సహనాన్ని నింపేందుకు ప్రయత్నించారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానసిక స్థైర్యం కల్పించడం అవసరమే అయినా, అంతకంటే మించిన అత్యవసరంగా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయని కమల్ తెలిపారు. మానసిక స్థైర్యం పెంచేందుకు ప్రధాని చేసిన మాటలు సంపన్నులు బాల్కనీలలో నిలిచి ఉత్సాహంగా పనిచేయడానికి ఉపయోగపుడుతుందేమోకాని, పైకప్పులు లేని ఇళ్ళలో నివసించే బడుగు ప్రజానీకానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని కమల్ ఆరోపించారు. సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న నిరుపేదలను పూర్తిగా విస్మరించి బాల్కనీవాసుల (సంపన్నుల) కోసమే నడిచే బాల్కనీ ప్రభుత్వం నడపాలని ప్రధాని మోదీ భావించడం లేదని తనకు తెలుసునని, అయితే నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వాలు కూలిపడిన సంఘటనలెన్నో చర్రితలో ఉన్నాయని తెలిపారు. దినకూలీలు, ఇళ్ళలో పనిమనుషులుగా ఉన్నవారు.
ఫ్లాట్‌ఫామ్ వ్యాపారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, వలస కార్మికులు ఇలా లక్షలాదిమంది తమ జీవనాధారం పూర్తిగా కోల్పోయి బ్రతుకు తెరువు కోసం పోరాటం సాగిస్తుంటే మధ్యతరగతి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కమల్ విమర్శించారు. మధ్య తరగతి ప్రజలను విస్మరించాలన్నది తన అభిమతం కాదని, సమాజంలోని అన్ని వర్గాలవారిని కాపాడాలనే కోరుతున్నానని చెప్పారు. ఆకలి దప్పులతో ఎవరూ అలమటించకూడదని, కరోనా వైరస్ నుంచి కాపాడతామంటూ చెప్పి నిరుపేదలు ఆకలి మంటల్లో ఆహుతయ్యేలా చేయడం దారుణమన్నారు. ప్రధాని మోదీ దీర్ఘ దృష్టి చిత్తుగా ఓడిపోయిందని, తనను దేశానికి విరోధి అంటూ మోదీ అనుచరులు విమర్శించినా పట్టించుకోనని, సహజమైన భద్రతతో కూడిన జీవనం సాగించేందుకే ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జీతభత్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తామంతా ఆగ్రహావేశాలతో ఉన్నా ప్రధాని వెంటే నిలిచి ఉన్నామని కమల్ ఆ లేఖను ముగించారు.