లౌడ్ స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన తాజాగా మరోసారి హెచ్చరికలు చేసింది. మసీదులపై లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని ఎంఎన్ఎస్ పుణే శాఖ తాజాగా డిమాండ్ చేసింది.
మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే ఈ సారి పోలీసు స్టేషన్ల ముందు లౌడ్ స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులు కామని వెల్లడించింది.
ఈ మేరకు పుణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తాకు ఎంఎన్ఎస్ నేతలు లేఖ రాశారు. రాష్ట్రంలో లౌడ్ స్పీకర్ల వివాదం ఇంకా ముగియలేదని వాటిని తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని లేఖలో వివరించారు.
మసీదులపై లౌడ్ స్పీకర్లు అనేది సామాజిక సమస్య అని లేఖలో పేర్కొన్నారు. దాన్ని అనవసరంగా మత సమస్యగా మార్చకండని అన్నారు. తాము ప్రార్థనలకు వ్యతిరేకం కాదని, కానీ ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో చేసి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు.