బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం.. రాజస్థాన్ లోని మాధోపూర్‌లోని ఫోర్ట్ బార్వారా వేదికగా జరగబోతుంది. అయితే, ఈ వివాహానికి హాజరైన వారికి ఈ జంట కొన్ని షరతులను విధించింది. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని తెలిపింది. ఇక్కడ వరకూ మంచిగా ఉన్నప్పటికీ.. ఈ వేడుకకు హాజరైయ్యే వాళ్లు సెల్ ఫోన్లు తీసుకురావద్దని వింత షరతుని విధించారట.
ఈ వేడుకలో ఫోటోలు తీయకూడదని.. ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్న ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే, దీనిపై కత్రినా కైఫ్ సన్నిహిత వర్గాలే మండిపడుతున్నాయి. వివాహానికి హాజరైన వారికి బయట ప్రపంచంతో సంబంధాలు ఎలా నిలిపివేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే తాము విన్న అతి పెద్ద జోక్ అని మరికొందరు అనుకుంటున్నారు. అసలు ఇది పెళ్లా? లేకపోతే నామ్ సమ్మిట్‌నా అని మరో స్నేహితుడు ప్రశ్నించాడు.