ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్ లోని పశ్చిమ అజార్ బైజార్ ప్రావిన్సులో ఈ భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4 గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపంలో సుమారు 530 మంది గాయపడ్డారు. ఇందులో సుమారు135 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.
భూకంపం తీవ్రతకు సుమారు 12కు పైగా గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని అధికారులు చెప్పారు. తెల్లవారు జామున 3.30 గంటలకు భూకంపం సంభవించిందని, చాలా వరకు ఇండ్లు దెబ్బ తిన్నట్టు ఇరాన్ టెలివిజన్ వివరాలు తెలిపాయి.
భూకంప కేంద్రానికి సమీపంలోని సల్మాస్, ఖోయ్ నగరాలకు సమీపంలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాలకు, గ్రామాలకు విద్యుత్, నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. చివరిసారిగా 1990లో ఇరాన్ లో చివరిసారిగా ఘోరమైన భూకంపం సంభవించింది. ఇందులో 40,000 మంది మరణించారు.