తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
అదే కేసీఆర్ కు వెంకయ్యనాయుడు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఇక ఇలా ఉంటే.. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అమ్మోరుకు బంగారు ఆభరణాలు సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. పలు కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు ఆహారం, దుస్తుల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనేక చోట్ల హోర్టింగ్ లు కూడా ఏర్పాటు చేశారు.