లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాహుల్ గాంధీ తీరును ప్రధాని మోడీ తప్పుబట్టారు. సభలో కూర్చోని, చెప్పేది వినే ఓపిక లేని సభ్యుడికి తాను బదులిచ్చేది ఏముందన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఐ వార్తా సంస్థతో ప్రధాని మోడీ మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, భారత్-చైనా అంశంపై రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలను మీడియా ప్రతినిధి గుర్తు చేశారు.
అయితే.. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ప్రతీ అంశంపై వాస్తవాలు అందించానన్నారు. నిజాలు ఆధారంగా ప్రతీ అంశంపై మాట్లాడానాను అని బదులిచ్చారు ప్రధాని. కొన్ని అంశాల్లో విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి లోతైన సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో తాను కూడా మాట్లాడానన్నారు.
కానీ.. సభలో కూర్చోని, చెప్పేది వినని సభ్యుడికి నేను సమాధానం చెప్పేది ఎలా? అని మోడీ పేర్కొన్నారు. చెప్పేది విరకుండా ఎదురు ప్రశ్నలకు దిగడం సరికాదన్నారు. వారు అడిగే ప్రతీ సమస్యకు తమ దగ్గర సమాధానం ఉందన్నారు. తమ ప్రభుత్వం చర్చలనే కానీ.. దాడులను విశ్వసించదన్నారు మోడీ.
తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరిపైనా దాడి చేయరని అన్నారు. దానికి బదులు చర్చలను నమ్ముతామని పేర్కొన్నారు. చర్చలన్నప్పుడు అవరోధాలు ఉంటుంటాయని వ్యాఖ్యనించారు. వాటిని తాను స్వాగతిస్తానని మోడీ తెలిపారు.